గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధి విదానాలను కౌంటింగ్ సిబ్బందితో పాటు అధికారులు కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కే. రాజ్యలక్ష్మి ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జూన్ 4 న జరిగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, విధులు కేటాయించ బడిన అధికారులు ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. ఈ.వి.యం ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ మరియు పోస్టల్ బ్యాలట్ ఓట్ల లేక్కిమ్పునకు 5 టేబుల్స్ కేటాయించామన్నారు. ఓట్ల లెక్కింపు మొత్తం 21 రౌండ్స్ లో పూర్తి చేయుట జరుగుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపులో తొలుతగా పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓట్లు లెక్కించడం జరుగుతుందని, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో వ్యాలిడ్, ఇన్ వ్యాలిడ్ ఓట్లను ఎలా వేరు చేయాలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు సంబంధించిన సూచనలను ఆర్ఓలు, ఏఆర్ఓలు తప్పనిసరిగా చదివి అర్దం చేసుకోవాలన్నారు. కౌంటింగ్ విధులు కేటాయించబడిన వారు తప్పనిసరిగా ఐడి కార్డ్ లు ధరించాలని, కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్ అనుమతి లేనందున సెల్ ఫోన్ డిపాజిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్ కేంద్రంలో తగిన టేబుల్స్, ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్లు, ఆపరేటర్లు ఉండేలా పర్యవేక్షణ చేయాలని ఈఈని ఆదేశించారు. కౌంటింగ్ విధులు కేటాయించబండిన అధికారులు మరియు సిబ్బంది నిర్దేశిత సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుండి ఈవిఎంలు తీసుకొచ్చేందుకు, అధికారులు, లెక్కింపు సిబ్బంది, అభ్యర్ధులు, ఏజంట్లు లెక్కింపు కేంద్రంలోనికి వచ్చేందుకు వేరువేరుగా మార్గాలు ఉండాలలని, అవసరమైతే బారీకేడింగ్ చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కు అవసరమైన మెటీరియల్ ను చెక్ లిస్ట్ మేరకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డిప్యూటి కమీషనర్ సి.హెచ్ శ్రీనివాసరావు, ఈ.ఈలు కొండారెడ్డి, కోటేశ్వర రావు, డి.ఈ.ఈలు రఫిక్, సూపరిండెంట్లు వెంకటరామయ్య, పద్మ, ఎ.సి.పి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …