-జిల్లాలో త్రాగు నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలి
-సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సీ ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి త్రాగు నీటి సరఫరా, డెంగ్యూ, మలేరియా నివారణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… అన్ని జిల్లాలలో త్రాగు నీటి సరఫరా పై ప్రత్యెక శ్రద్ద వహించాలని, జిల్లాలలో మలేరియా, డెంగ్యూ కేసులను గుర్తించి ప్రబలకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు. గ్రామాలలో త్రాగునీటి సంపులలో నీరు అధిక రోజులు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీరు ఎక్కడ నిలువ ఉండకుండా, మలేరియా, డెంగ్యూ కు సంబంధించి కేసులు నమోదు కాకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని మురుగునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, నివారణ దిశగా శానిటేషన్, మంచి నీటి ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య సిబ్బంది, వైద్య కిట్లతో నగరంలోని ప్రతి వార్డు, ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వ్యక్తిని పరీక్షించి సర్వే చేపట్టాలని వైద్య సిబ్బందినీ ఆదేశించారు. అవసరo మేరకు మలేరియా, డెంగ్యూ కేసులకు సంబంధించిన రక్త పరీక్షలు చేయాలని, రక్త పరీక్షలు చేసిన అనంతరం రిపోర్టులో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి వైద్య సహాయాన్ని అందించాలని అన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంఛార్జి డిపిఓ సుశీల దేవి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ విజయ కుమార్, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డి సి హెచ్ ఎస్ ఆనందమూర్తి, తదితరులు పాల్గొన్నారు.