అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ చరిత్రలో చేనేత యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆగష్ట్ 07వ తేదీని జాతీయ చేనేత దినోత్సవముగా 2015 సంII నుండి జరుపుకొనుచున్నాము. స్వాతంత్ర్య ఉద్యమ సమయములో ప్రజలలో చైతన్యమును రగిలించుటకు, స్వదేశీ వస్తు ఉద్యమములో భాగంగా చేనేత వస్త్ర ఉత్పత్తి కేంద్రముగా సాగిన ఉద్యమమునకు గుర్తుగా జాతీయ చేనేత దినోత్సవముగా జరుపుకొనుచున్నాము.
స్వాతంత్ర్య ఉద్యమములో భాగంగా, మహాత్మా గాంధీగారిని ప్రభావితం చేసిన పొందూరు ఖాదీ వస్త్రములు శ్రీకాకుళంనకు25కి.మీ. ల దూరములోయున్న పొందూరు గ్రామములో తయారు కాబడి ప్రసిద్ధి పొందుచున్నవి.
ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవము సందర్భముగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పొందూరు ఖాదీ తయారీపై “ వీడియో తయారీలో ” పోటీలను నిర్వహించుచున్నది. ఈ పోటీలో పాల్గోనదలచినవారు తాము తయారు చేసే వీడియోలు పొందూరు ఖాదీ వస్త్ర తయారీలోని అన్నీ దశలను పొందుపరుస్తూ చేయవలెను. ప్రభుత్వము వారు ఉత్తమ వీడియో చిత్రానికి నగదు పారితోషకము మరియు ప్రశంస పత్రముతో సత్కరించెదరు. ఉత్సాహవంతులైన వారు తదుపరి వివరములకు క్రింద తెలిపిన అధికారిని 26 జులై 2024 లోగా సంప్రదించి తమ వీడియోలను ఆగష్ట్ 01వ తేదీలోగా సమర్పించవలెను.
P. శ్రీనివాస రెడ్డి , సహాయ సంచాలకులు,ఫోన్ నెం.9492344466, కమీషనర్ కార్యాలయము, చేనేత మరియు జౌళి శాఖ, 4వ అంతస్తు, IHC కార్పోరేట్ బిల్డింగ్, మంగళగిరి, గుంటూరు, నందు సంప్రదించగలరు.
Tags AMARAVARTHI
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …