మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల సమావేశం


-సమస్యలు పరిష్కరించాలని టీడీ జనార్ధన్‌కు వినతి
-సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని టీడీ జనార్ధన్‌ హామీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొటిట్‌ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్‌ అధ్యక్షతన శుక్రవారం రిటైర్ట్‌ ఆర్మీ ఉద్యోగుల సమావేశాన్ని మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏపీ స్టేన్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు, జనరల్‌ సెక్రటరీ వై. రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు. వీరితో పాటు ఆ సంఘ జిల్లా ఇంఛార్జ్‌లు, నియోజకవర్గ ఇంఛార్జ్‌ లు 450 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ ఉద్యోగుల సమావేశం మొదటిసారి నిర్వహించినట్లు.. నాడు చంద్రబాబు మాకు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. అప్పటి నుండి టీడీపీ పై మాకు అభిమానం పెరిగిందని రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగులు అన్నారు. నేడు కూటమి గెలపుకు తమ వంతు కృషి చేసినట్లు పేర్కొన్నారు. కావున తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కేంద్రియ సైనిక బోర్డులో ఏపీ నుండి ఒక్క రిప్రజెంటేటీవ్‌ కాని.. జేసీవో కాని లేరని.. వేంటనే ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగులకు టీడీపీలో ప్రత్యేక సెల్‌ ఉండేదని రాష్ట్ర విభజన తరువాత నేడు ఆ అవకాశం లేదన్నారు. దీంతో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం తావులేకుండా పోయిందన్నారు. దివంగత ముఖ్యంత్రి ఎన్టీఆర్‌ హయాంలో ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ ఉద్యోగుల కోసం 2% రిజర్వేషన్‌ కోటాను ఏర్పాటు చేస్తే ఆ రిజర్వేషన్‌ నేడు ఎక్కడా అమలు కావడంలేదన్నారు. ఆ రిజర్వేషన్‌ను తిరిగి కొనసాగించాలని వారు కోరారు. 191 జీవో ప్రకారం బ్యాక్‌లాగ్‌ పోస్టులను ఎక్స్‌ ఆర్మీ ఉద్యోగులకు కేటాయించాలి కాని ఆ జీవో కూడా అమలు కావడంలేదన్నారు. ఇలా ఎన్నో హక్కులు మాజీ సైనిక ఉద్యోగులకు ఉన్నా ఆర్‌ఎస్పీ, జెడ్‌ఎస్పీలు వాటిగురించి అవగాహన కల్పించడంలేదన్నారు. మాజీ సైనికుల హక్కులను కాపాడాలని వారు కోరారు.
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొటిట్‌ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్‌ మాట్లాడుతూ దేశ ప్రజలకోసం ప్రాణాలకు తెగించి సంవత్సరాల తరబడి సైనికులు ఇళ్లు వాకిళ్లను వదిలి పనిచేయడం చెప్పలేని త్యాగం. మీ త్యాగానికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. అలాంటి రిటైర్డ్‌ సైనికోద్యోగుల సమస్యలకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న శంకర్‌రావును అభినందిస్తున్నానని అన్నారు. ఇచ్చిన అర్జీల్లో చాలా సమస్యలు నా ముందుకు వచ్చాయి. అదే వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి మీటింగ్‌లు పెట్టాలంటే పొద్దున్నే శంకర్‌రావును హౌస్‌ అరెస్ట్‌ చేసేవారు. అలాంటి చీకటి రోజుల నుండి మనం బయటకు వచ్చాం. మాజీ సైనికుల సమస్యలను ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మిగిలిన సైనిక సంఘాల్లో ఉన్న ఉద్యోగులతో కూడా స్నేహంతో ఉండి.. సమస్యలు పరిష్కరించుకుంటూ.. మళ్లీ 2029 లో కూడా టీడీపీ గెలుపు కృషి చేయాలి. మీమీ ప్రాంతాల్లో ఉన్న మాజీ సైనిక ఉద్యోగులను గ్యాదర్‌ చేసి మీ సంఘంలో చేర్చుకోండి. కాబట్టి నిరంతరం 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని 800 మంది సభ్యులుగా ఉన్న సంఘం అభివృద్ధి చెంది లక్షమందితో పెద్ద బహిరంగ సభ పెట్టుకునేలా పనిచేయాలని కోరుకుంటున్నానన్నారు. ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అందరి సమస్యలు పరిష్కారం కావాలి అందరి సంతోషంగా ఉండాలన్నదే ఎన్టీఆర్‌ చూపిన బాటలో నడిచే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన మాజీ సైనిక ఉద్యోగులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *