చందర్లపాడు మండలం (చింతలపాడు), నేటి పత్రిక ప్రజావార్త :
గురుపౌర్ణమి మహోత్సవాన్ని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో శ్రీ నూకేశ్వరి అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ పబ్బతి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఆమె ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు తంగిరాల సౌమ్య గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు. అనంతరం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మొక్కలు చెల్లించుకున్న ఎన్డీఏ నేతలు , ఈ కార్యక్రమంలో గ్రామ, మండల పార్టీ నాయకులు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …