బిజెవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

-ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో వేలకోట్లు కేటాయించిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బిజెపి తో సాధ్యమన్నారు. ఎన్ డి ఎ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతుంద న్నారు. బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టావంశీ మాట్లాడుతూ యువతకు బడ్జెట్ లో పెద్ద పీట వేశారన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ మహిళలు కు ప్రధాన మంత్రి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. దేశ సర్వతో ముఖాభివృద్దికి ఈ బడ్జెట్ సంకేతమని మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీ నివాస్ బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బిజెపి నేతలు మువ్వల వెంకట సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, బిజెపి వైఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *