Breaking News

విశాఖ అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి మొద‌టి ద‌శ ప‌నులు సెప్టెంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్తి చేయాలి.

-యూజీడీ ప‌నుల పురోగ‌తిపై మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌మీక్ష‌
-ఈనెల 26 న మ‌రోసారి స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి ప‌నుల‌పై అధికారులు,కాంట్రాక్ట్ సంస్థ‌ ప్ర‌తినిధుల‌తో మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ స‌మావేశ‌మ‌య్యారు..విజ‌య‌వాడ‌లోని సీఆర్డీఏ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి జీవీఎంసీ అధికారుల‌తో పాటు యూజీడీ ప‌నులు చేస్తున్న టాటా ప్రాజెక్ట్స్ సంస్థ ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు..విశాఖ‌ప‌ట్నంలోని పెందుర్తి,గాజువాక‌,మ‌ల్కాపురం ప్రాంతాల్లో రెండు ప్యాకేజిలుగా అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి ప‌నులను చేప‌ట్టారు…ఈ రెండు ప్యాకేజిల ప‌నుల‌ను టాటా ప్రాజెక్ట్స్ సంస్థ ద‌క్కించుకుంది..రెండు ప్యాకేజిల ద్వారా మురుగునీరు పారుద‌ల కోసం అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణంతో పాటు రీసైక్లింగ్ వాట‌ర్ ను హెచ్ పీసీఎల్,ఆర్ ఐ ఎన్ ఎల్ కు స‌ర‌ఫ‌రా చేసేలా కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం చేసుకుంది.మొద‌టి ప్యాకేజిలో భాగంగా పెందుర్తి ప్రాంతంలో 226 కిలోమీట‌ర్ల యూజీడీ ప‌నుల‌ను 412 కోట్ల‌తో చేప‌ట్టింది..మొద‌టి ప్యాకేజిలో 46 ఎంఎల్ డీ నీటిని రెండు సంస్థ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంది…ఇక రెండో ప్యాకేజిలో భాగంగా గాజువాక‌,మ‌ల్కాపురం ప్రాంతాల్లో 429 కిమీ మేర యూజీడీ ప‌నుల‌ను 530 కోట్ల‌తో చేపట్టారు..రెండు ప్యాకేజిల‌కు సంబంధించిన ప‌నుల‌పై మంత్రి సుదీర్ఘంగా చ‌ర్చించారు…కాంట్రాక్ట్ సంస్థ టాటా ప్రాజెక్ట్స్ కు పెండింగ్ ఉన్న బిల్లుల‌ను త్వ‌రిత‌గ‌తిన క్లియ‌ర్ చేయాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌కు సూచించారు.మొద‌టి ప్యాకేజి ప‌నుల‌ను సెప్టెంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్తి చేయాల‌ని టాటా ప్రాజెక్ట్స్ ప్ర‌తినిధుల‌ను ఆదేశించారు…ఈనెల 26 వ తేదీన మ‌రోసారి ఉన్న‌తాధికారుల‌తో ఈ అంశంపై చ‌ర్చించాల‌ని మంత్రి నారాయ‌ణ నిర్ణ‌యించారు…వ‌చ్చే వారంలో విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించి ప్రాజెక్ట్ ప‌నుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించాల‌ని మంత్రి నారాయ‌ణ నిర్ణ‌యించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *