Breaking News

రైతు బజార్లలో కందిపప్పు బియ్యం ధరల తగ్గింపు

-దేశవాళీ కందిపప్పు కేజీ రు. 160 నుండి 150 కి తగ్గింపు
-స్టీమ్ రైస్ కేజీ రు.49 నుండి 48 కి , రా రైస్ కేజీ రు.48 నుండి 47 కు తగ్గింపు
-వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి
-జాయింట్ కలెక్టర్

మచిలీపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త :
పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణలో భాగంగా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల్లోని 9 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసి బహిరంగ మార్కెట్లో ధరలకు కళ్ళం వేస్తూ గత నెల జూలై 11 వ తేదీ నుండి నాణ్యమైన స్టీమ్డ్ రైస్ (బి.పి.టి/సోనా మసూరి రకం) కేజీ రూ.49/- చొప్పున, RAW రైస్ (బి.పి.టి/సోనా మసూరి రకం) కేజీ రూ.48/- చొప్పున మరియు దేశవాళీ కందిపప్పు ధర కేజీ ఒక్కింటికి రూ.160/- చొప్పున వినియోగదారులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరఫరా చేస్తున్న విషయం విధితమే అన్నారు.

కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల నుండి పెరుగుతున్న ఆదరణ దృష్టిలో ఉంచుకొని గురువారం నుండి (01.08.2024 నుండి) నాణ్యమైన స్టీమ్డ్ రైస్ (బి.పి.టి/సోనా మసూరి రకం) కేజీ రూ.49/- నుండి రూ. 48/- కు, RAW రైస్ (బి.పి.టి/సోనా మసూరి రకం) కేజీ రూ.48/- నుండి రూ. 47/- కు మరియు దేశవాళీ కందిపప్పు ధర కేజీ ఒక్కింటికి రూ.160/- నుండి రూ.150/- కు తగ్గించి విక్రయాలు జరుగుతున్నట్లు జెసి తెలిపారు.

జిల్లాలోని మచిలీపట్నం, పెడన, చల్లపల్లి, కూచిపూడి, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, గుడివాడ మరియు గన్నవరం నందు ఉన్న (9) రైతు బజార్లలో గల ప్రత్యేక కౌంటర్ల ద్వారా మరియు జిల్లాలో గల డి మార్ట్, రీలయన్స్, ఉషోదయ, విశాల్ మెగా మార్ట్, మోర్, విజేత, రత్నదీప్ మొదలగు (15) బిగ్ చైన్ రిటైల్ మాల్స్ నందు దేశవాళీ కందిపప్పు మరియు బియ్యము పైన పేర్కొన్న తగ్గింపు ధరలకు వినియోగదారులకు విక్రయాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో 413.61 మెట్రిక్ టన్నుల నాణ్యమైన స్టీమ్డ్/RAW బియ్యము (బి.పి.టి/సోనా మసూరి రకం) మరియు 113.53 మెట్రిక్ టన్నుల దేశవాళీ కందిపప్పు అమ్మకం జరిగిందన్నారు. ప్రత్యేక కౌంటర్లను పౌర సరఫరాల శాఖ, తూనికలు మరియు కొలతలు శాఖ, వినియోగదారుల సేవా సంఘాల వారు సందర్శించి కందిపప్పు మరియు బియ్యము నాణ్యతను/ పరిమాణాన్ని తరచుగా తనిఖీ చేయటం జరుగుతున్నదన్నారు.

కావున వినియోగదారులు ఈ నాణ్యత కలిగిన కందిపప్పు మరియు బియ్యములను నిర్ధేశించిన తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా కోరారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *