Breaking News

ఉపాధి కొరకు గల్ఫ్‌ వెళ్ళే వారికి ముందస్తు ప్రయాణ అవగాహన కల్పించండి…

-ఓంకాప్‌ జియం బిఆర్‌ క్రాంతికుమారి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి కొరకు గల్ఫ్‌ దేశాలకు వెళ్ళేవారికి ప్రయాణ జాగ్రత్తలు ఉద్యోగ మెళుకవులు పై శిక్షణ కల్పించి గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా మాత్రమే గల్ఫ్‌ దేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ బిఆర్‌ క్రాంతి కుమారి తెలిపారు. ఉపాధి అవకాశలు పొందేందుకు గల్ఫ్‌ వర్క్‌ర్లకు అందించాల్సిన శిక్షణపై ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ బిఆర్‌ క్రాంతి కుమారి విజయవాడ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో గల ఓంకాప్‌ కార్యాలయంలో శ్రీకాకుళం విశాఖపట్నం, కడప, చిత్తూరు, కాకినాడ, విజయవాడ జిల్లా ఉపాధి కల్పనా అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జనరల్‌ మేనేజర్‌ బిఆర్‌ క్రాంతి కుమారి మాట్లాడుతూ విదేశాలలో ఉపాధి అవకాశాలు కొరకు వెళ్ళే వారికి పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఉపాధి కొరకు గల్ఫ్‌ వెళ్ళే వారి సంఖ్య నానాటికి పెరుగుతుందన్నారు. సరైన అవగాహన లేక గల్ఫ్‌ దేశాలలో ఉపాధి కోసం వెళ్ళిన వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సరైన దృవప్రతాలతో ప్రభుత్వ అనుమతితో నడపబడే రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్ళేలా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి కోరే వారు అవగాహన పూరిత నిర్ణయం తీసుకోవాలి. గృహకార్మికులుగా పని చేయుటకు తగిన నైపుణ్యం ఉండేలా నైపుణ్య శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరిమైన వివరాలతో కనీసం 6 నెలల పాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్‌ వర్క్‌ వీసా తప్పనిసరిగా ఉండాలన్నారు. గృహా కార్మికులు విదేశాలకు వెళ్ళే ముందు ఆర్యోగ ఆర్థిక విషయాల పట్ల పై శ్రద్ద చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. విమానాశ్రయం వద్ద పాటించాల్సిన భద్రత విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి అవకాశం పొందిన వారికి లైంగింక వేధింపులు, హింస, ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాల్సిన విధానంపై అవగాహన కల్పించాలన్నారు. గల్ఫ్‌ వర్క్‌లు పూర్తి స్థాయిలో శిక్షణ అందించి సురక్షతంగా ఉద్యోగాలను నిర్వహించుకునేలా కృషి చేయాల్సిన భాధ్యత ఓంకాప్‌ జిల్లా ఉపాధి కల్పన అధికారులు సయుక్తంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఓంకాప్‌ హెచ్‌ ఆర్‌ మేనేజర్‌ ఎం సతీస్‌బాబు, సీనియర్‌ అసిస్టెంట్‌ జి. గోపి, విశాఖపట్నం శ్రీకాకుళం, కడప, కాకినాడ, చిత్తురు, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు చెందిన ఉపాధి కల్పన కార్యాలయ సిబ్బంది మనోరమ, వై రవీర్రదనాద్‌ కుమార్‌, శివసాయి రెడ్డి, శిరీష, వివేక్‌, టి. విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *