-లెప్రసీ కాలనీవాసులకు మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశం
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం వయవృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచి ఆసరాగా నిలిచిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో నెల పింఛన్లు పంపిణీ తెల్లవారు జామునే ప్రారంభమై ముగింపుకు చేరుకుంది. గురువారం స్థానిక మారుతి నగర్ 7వ వార్డు లెప్రసీ కాలనీ నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో కుష్టు వ్యాధిగ్రస్తులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా పెన్షన్లను అందజేశారుజిల్లాలో 2,31,874 మంది పింఛన్ దారులకు రూ.97.26 కోట్లు అందజేయనున్నారు.