Breaking News

బుద్ధి కుశలత తో మెరుగైన పాలన సాధ్యం అంశంపై అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన విజయవాడ ఎ .కన్వెన్షన్ సెంటర్లో బుద్ధి కుశలత తో మెరుగైన పాలన సాధ్యం అంశంపై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం ప్రతినిధి పద్మజ తెలిపారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా పిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యం ఈ కార్యక్రమం జరుగుతుందని, సమావేశంలో భాగంగా ఈనెల 5వ తేదీన జరగనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రికను ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆవిష్కరించారు. రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విజయవాడ శాఖ ప్రతినిధి పద్మజ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుండి అడ్మినిస్ట్రేటర్స్ రింగ్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ చైర్పర్సన్ రాజయోగిని బికే ఆశా దీదీ హాజరవుతున్నారని అన్నారు. 1936వ సంవత్సరంలో స్థాపించిన ప్రజాపిత బ్రహ్మ సమాజ కుమారి సంస్థ రాజస్థాన్లో మౌంట్ అబూ కేంద్రంగా 120 దేశాలలో పదివేల శాఖలుగా విస్తరించి రాజీయోగ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు పరిశ్రమలు, వ్యాపార ,సంస్థలలో, ఉన్నత అధికారి నుంచి దిగువ స్థాయి అధికారి వరకు మానసిక ఒత్తిడి అధిగమించి స్నేహపూర్వకముగా నిజాయితీ విధానాలతో కలిసి, మెలసి విధి నిర్వహణలో పాల్గొనేలా చేయడమే తమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత, ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ ఉదయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, ఏపీ ఎన్ఓ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పివీ చలపతిరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్ సింగ్, అన్ని రంగాల ప్రముఖులు తదితరులు హాజరుకానునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రాధ, బ్రహ్మకుమారి రత్న, బ్రహ్మకుమారి శిరీష, బ్రహ్మకుమారి చంద్రశేఖర్, ప్రజాహిత బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *