విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు హెచ్ బి కాలనీ,చిట్టినగర్, ల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ నిల్వ లు, పలు రికార్డులను ఆయ న తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిధిలో గర్భిణుల వివరాల నమోదు, ఓపీ తదితర విషయాలను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. పశ్చిమ లోని ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు సిబ్బంది కూడా తప్పని సరిగా హాజరు కావాలని సూచించారు. వైద్యసిబ్బంది దీర్ఘకాలిక పేషంట్లకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని, సిబ్బంది తీసుకొవాల్సిన పలు విషయాలపై సూచనలు సలహాలు చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా హెల్త్ క్యాంపులను ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామన్నారు. నియోజవర్గ ప్రజలందరూ హెల్త్ క్యాంపులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె నిరుపమ, డాక్టర్ ఎన్ రాజా, హెల్త్ సూపర్ వైజర్ అపరంజమ్మ, స్టాఫ్ నర్స్ చంద్రమతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …