Breaking News

అమ్మవారిని దర్శించుకున్న ఎం.పి కేశినేని శివనాథ్

-జ‌న్మ‌దినం సంద‌ర్బంగా దేవాలయాల సంద‌ర్శ‌న
-కుటుంబ సమేతంగా ప్ర‌త్యేక పూజ‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ అమ్మవారిని, శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం లో వినాయక స్వామిని ఆయ‌న స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ, త‌ల్లి ప్ర‌సూన్నాంబ‌తో క‌లిసి శ‌నివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వ‌హించి ఆశీస్సులు అందుకున్నారు.

ఎంపి కేశినేని శివనాథ్ కు కనకదుర్గమ్మ ఆలయ ఈ.వో కె.ఎస్ రామారావు స్వాగతం చెప్ప‌గా, మంగ‌ళ వాయిధ్యాల తోఆలయ ప్రధాన అర్చకులు వేదం మంత్రోచ్చారణ తో ఆహ్వానం పలికారు. అనంత‌రం అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ద‌ర్శనానంతరం ఆశీర్వ‌చ‌న మండ‌పంలో వేదపండితులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను ఆయ‌న స‌తీమ‌ణి జాన‌కీ ల‌క్ష్మీని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేయగా, ఆలయ ఈ.వో కె.ఎస్ రామారావు అమ్మవారి చిత్రపటాన్ని కేశినేని శివనాథ్ దంప‌తుల‌కు అందజేశారు. అంతకుముందు కెనాల్ రోడ్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలోని వినాయకుడిని ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది. ఆ భ‌గ‌వంతుడి దీవెన‌లు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ అభివృద్ధి పథంలో పయనించే విధంగా ఆశీర్వ‌దించాల‌ని ప్రార్ధించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *