Breaking News

ఉత్తమ సేవలకు కేంద్రం గుర్తింపు

-దేశంలో తొలిసారి జీవన్‌ధాన్‌ అవార్డు అందుకున్న ఏపీ
-ఢిల్లీలో అవార్డు స్వీకరించిన రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ కె.రాంబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు జీవన్‌ధాన్‌ పధకంపై అవగాహన, అవయువాలు దానాన్ని ప్రోత్సహిస్తున్న ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే జాతీయ అవయువదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సమావేశ మందరంలో ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వానికి లభించిన జీవన్‌ధాన్‌ అవార్డును రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రాంబాబు స్వీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు ధీటుగా అవయువాలను దానం చేయడంతో పాటు, ప్రజలకు విసృత అవగాహణ కార్యక్రమాలు నిర్వహించిన సేవలను గుర్తించి దేశ వ్యాప్తంగా అందించే ఈ అవార్డులను తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి దక్కింది. ఈ అవార్డును కేంద్ర, ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌, నీతి అయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వినోద్‌ కె. పాల్‌, ఆరోగ్యశాఖ సెక్రటరీ ఎస్‌.హెచ్‌. అపూర్వ చంద్ర, డాక్టర్‌ అతుల్‌ గోయల్‌ చేతుల మీదుగా ఈ అవార్డును డాక్టర్‌ కె. రాంబాబు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ జీవన్‌ధాన్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రాంబాబు మాట్లాడుతూ ఇదే స్పూర్తితో విద్యార్ధి దశ నుంచి ప్రత్యేకంగా అవయువదానంపై ప్రజలకు అవగాహన కల్పించేలా కృషి చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదేశాలను పాటిస్తూ ఈ పధకాన్ని మరింత పక్కగా అమలు చేస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *