గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రులకు నమ్మకంతో వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
శనివారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో రూ.4 కోట్ల విలువ గల సిటీ స్కాన్ యంత్రాన్ని ఓ.పి విభాగంలో గుండె జబ్బులను నిర్ధారించే ట్రెడ్ మిల్ యంత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ , వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి , ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , గుంటూరు తూర్పు , పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నజీర్ అహ్మద్ , గల్లా మాధవి , తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ లతో కలసి ప్రారంభించారు. అనంతరం జీజీహెచ్ లోని నాట్కొ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా వారితో మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని నాట్కో సెంటర్ లో నాట్కొ ఫార్మా కంపెనీ ద్వారా కాన్సర్ నివారణకు రూ.40 కోట్లతో ఆసుపత్రిని అభివృద్ది చేయడం జరిగిందన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రి అభివృద్ది కోసం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఆసుపత్రి అభివృద్దికి రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారాన్ని అందించారన్నారు.
రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల పేదలకు సేవలు అందించడంలో ముందు వరుసలో వుందన్నారు. పేదలకు సేవలు అందించేందుకు జీజీహెచ్ లో రూ.4 కోట్లతో సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. నాట్కో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ది పధకాలు కొనసాగుతున్నాయన్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదివి అమెరికా లో స్థిరపడిన పూర్వ విద్యార్దులు వంద కోట్లతో మెడికల్ కాలేజీ అభివృద్దికి సహకారం అందించారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్దిపై సమీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పై తప్పుడు ప్రచారం జరుగుతున్నదని , ఆరోగ్యశ్రీ పధకాన్ని నిలుపుదల చేయడం లేదని , ఆరోగ్యశ్రీ లో రూ.25 లక్షల వరకు చికిత్సలు చేయించుకోవచ్చని తెలియజేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. నకిలీ మద్యం, గంజాయి తో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని , నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురానున్నట్లు ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.
అనంతరం భారత మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రాంగణం లో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్ , నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సజీలా, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి , ఆసుపత్రి డాక్టర్లు , ప్రొఫిసర్లు , నర్సులు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …