విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన స్వతంత్ర బి.సి. సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ స్వతంత్ర బి.సి. ఉద్యమాలతోనే వెనుకబడిన తరగతుల రాజ్యాధికారం సాకారం కావడానికి దోహదపడుతుందని సూచించారు. ఇప్పటివరకు అగ్రకుల రాజకీయ పార్టీలు బి.సి.లని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చేస్తున్నాయని వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చెయ్యకుండా చిన్నచిన్న పదవులు ఎరవేస్తూ వీటికే పరిమితం చేస్తున్నాయని అంతేకాక రాజ్యాంగబద్ధమైన పదవుల్లో అగ్రకులాలకే ప్రాధాన్యత ఇస్తున్నా నోరు మెదపకుండా పప్పు బెల్లాలకే కొన్ని బి.సి. సంఘాలు పావులుగా మారి వారికి ఊడిగం చేస్తున్నాయని వాపోయారు. ఇలానే సాగుతుంటే ఇంకా 100 సంవత్సరాలైనా బి.సి.లకి రాజ్యాధికారం సాకారం అవ్వదని దీనికి స్వాతంత్ర బి.సి. కులాల సంఘాలన్ని ఏకమై నూతన రాజకీయ పార్టీగా అవతారమై ఉద్యమ దిశగా అడుగులు వేస్టేనే రాజ్యాధికార ఫలాలు ముందు తరాలకైనా అందుతాయని దీనికి తమ ఫెడరేషన్ ఎప్పుడూ ముందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై.కె., ప్రత్యూష సుబ్బారావు, వీరవల్లి
శ్రీనివాస్, తులశీరాం, నమ్మి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …