-కాంట్రాక్ట్టర్లతో సమావేశం నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరాభివృద్ధిలో కాంట్రాక్టర్ల పాత్ర ఎంతో కీలకమైనదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో నిర్వహించిన కాంట్రాక్టర్లతో సమావేశం లో అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోడ్లో, విజయవాడ అభివృద్ధి పనుల్లో వారి సహకారం, భాగస్వామ్యం, బాధ్యత, కనబడుతుందని. ఏ పని చేసినా నాణ్యత ప్రమాణాలతో చేయాలని. వారికి ఎటువంటి సమస్య ఉన్న కమిషనర్ గారికి ప్రత్యక్షంగా తెలుపవచ్చని. విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో కాంట్రాక్టర్లది ప్రధాన పాత్ర ఉందని, కాంట్రాక్టర్లు అందరూ ఒకరితో సమన్వయంగా ఉండాలని. నగరాభివృద్దికి వారి వినూత్న ఆలోచనలు, సూచనలను ఎల్లప్పుడూ సహకరిస్తారని అన్నారు.
ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు ముందుగా, విజయవాడ నగరానికి ధ్యానచంద్ర కమిషనర్ గా వచ్చినందుకు అభినందనలు తెలుపుతూ, వాళ్లకు రావాల్సిన చెల్లింపులు, డిపాజిట్లు, పనుల్లో వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులు గురించి కమిషనర్ గారికి తెలియపరచగా, వారి ప్రతి సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చూపుతామని అన్నారు.
ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో పాటు చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర్ రావు, సుపరిండెంటింగ్ ఇంజనీరలు నరసింహమూర్తి, రామ్మోహన్ రావు, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.