-వరద హెచ్చరిక కారణంగా ముందు జాగ్రత్తగా నగరపాలక సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి కి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వస్తున్న కారణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. మంగళవారం కమిషనర్ విడుదలచేసిన ప్రకటన లో పులిచింతల ప్రాజెక్ట్ నందు ఏర్పడిన సాంకేతిక ప్రమాదము కారణంగా వరద నీరు ప్రకాశం బ్యారేజికి వచ్చే అవకాశం ఉన్నందున నది ప్రవాహక లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వరదలు హెచ్చరిక సందర్భంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు ఎదుర్కొనుచున్న వివిధ సమస్యలను అధికారులకు తెలియజేసి యుద్దప్రాతిపధికన వాటిని పరిష్కరించుకొనుటకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన చంద్ర తెలియజేసారు. 3 షిఫ్ట్ లలో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ పని చేస్తుందని కమిషనర్ వివరించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వరదల ప్రభావం కారణంగా నగర పరిధిలో ఎక్కడైనా రోడ్లపై నీటి నిల్వలు, త్రాగునీటి పైపు లైనులు లీకులు రిపైర్లు, సీజనల్ వ్యాదులు, చెట్లు విరిగి పడిపోవుట, కొండ రాళ్లు జారిపడుట, డ్రెయిన్స్ / కాలువలు పొంగిపోర్లుట వంటి సమస్యకు ఎదురైనచొ సమస్యలను నేరుగా వాట్సప్ నెం 8181960909, ల్యాండ్ లైన్ నెం. 0866-2427485, 0866-2424172, లకు కాల్స్ చేసి సమస్యలను తెలియజేసిన యెడల కంట్రోల్ రూమ్ సిబ్బంది సంబందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలియజేసారు.