-రోడ్డుమీద వర్షపు నీటి నిల్వలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెంజ్ సర్కిల్ వద్ద వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం పర్యటించి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని. రోడ్డుపైన వర్షపు నీటి నిలువలను లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ ప్రజలకు, ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా, సిబ్బంది నిరంతరం ఫీల్డ్ లో ఉంటూ చూసుకోవాలి అని అన్నారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద జరుగుతున్న గ్రీన్ బెల్ట్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా పూర్ణానంద పేట, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పరిశీలించారు. పూర్ణానంద పేట ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరగకపోవడం గమనించి పారిశుద్ధ కార్మికులు పరిస్థితి నిర్వాహణలో ఎటువంటి అలసత్వం వహించకుండా పారిశుద్ధం పక్కగా నిర్వహించాలని నగరాన్ని అందంగా, ప్రజలను ఆరోగ్యంగా ఉంచేందుకు పారిశుద్ధ నిర్వహణ ఖచ్చితంగా జరగాలని అన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జరుగుతున్న పనులను పరిశీలించి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కేవీ సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ ఎస్ ఎన్ ప్రసాద్, వి శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ రామ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.