ఆదివాసి దినోత్స‌వ వేడుక‌ల ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షించిన టిడిపి నాయ‌కులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో శుక్ర‌వారం ఉద‌యం జ‌ర‌గబోయే ప్ర‌పంచ ఆదివాసి దినోత్స‌వ వేడుక‌ల కార్య‌క్ర‌మ ఏర్పాట్లను గిరిజ‌న కార్పొరేష‌న్ మెనేజింగ్ డైరెక్ట‌ర్ బి.న‌వ్య ఐ.ఏ.ఎస్ స‌మ‌క్షంలో గురువారం టిడిపి రాష్ట్ర నాయ‌కులు మాదిగాని గురునాథం, ఎంపి సెక్ర‌ట‌రీ నర‌సింహా చౌద‌రి స‌మీక్షించారు. ఈ వేడుల‌కి ముఖ్యఅతిథిగా సీఎం చంద్ర‌బాబు నాయుడు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆదివాసీలు హాజ‌రుకానున్న‌ట్లు తెలుగు దేశం నాయ‌కులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు అబీద్ హుస్సేన్, డాక్ట‌ర్ సంకె విశ్వ‌నాథం, డాక్ట‌ర్ చైత‌న్య‌, చింతా వెంక‌టేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *