-ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి హరీష్ మాధుర్ కు విజ్ఞప్తి
-జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) పంపాలని కోరిన హరీష్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
వక్ఫ్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే ముస్లిం సమాజానికి కలగబోయే ఇబ్బందుల్ని, వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు వాటిల్లే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాఉల్లాహ్, జమాతే ఇస్లామి హింద్ సంస్థ బృందం తో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, అమలాపురం ఎంపి హరీష్ మాధుర్ కి కులంకషంగా వివరించారు. గురువారం ఢిల్లీలో మొహమ్మద్ ఫతాఉల్లాహ్ నేతృత్వంలో జమాతే ఇస్లామి కార్యదర్శి అబ్దుల్ రఫీఖ్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇనామూర్ రెహమాన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ హసీబుర్రహ్మాన్ కలిసి వక్ఫ్ సవరణ బిల్లు అడ్డుకోవాలని కోరారు. ఈ ఇద్దరు ఎంపిలు జమాతే బృందం చెప్పిన విషయాలపై సానుకూలంగా స్పందించటమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ విషయంపై తగిన విధంగా స్పందిస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముస్లిం సమాజానికి ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లే చర్యలు ప్రోత్సహించరని భరోసా కల్పించారు. అనంతరం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై అమలాపురం ఎంపి హరీష్ మాధుర్ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఈ బిల్లు ను జాయింట్ పార్లమెంట్ కమిటీకు పంపవలసిందిగా కోరారు.. వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీ కు పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగినది.