విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో సౌత్‌కాన్-2024 సదస్సును నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ జాతీయ కార్యదర్శి జి.రామ్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై గురువారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌రెడ్డి మాట్లాడుతూ విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సౌత్‌కాన్`2024ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు మంది ప్రముఖులు, ఒకచోట చేర్చడం ద్వారా విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహించడానికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీ సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి మాట్లాడుతూ, దక్షిణాదిలోని ఐదు ప్రతిష్టాత్మ రాష్ట్రాల బిల్డర్లు సౌత్‌కాన్‌లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన చంద్రబాబు నేపధ్యంలో అమరావతి అభివృద్ధిచెందుతుందని తద్వారా విజయవాడ-గుంటూరు పెద్ద మెగాసిటీ అవ్వబోతుందన్నారు. సదస్సులో డెవలపర్స్, కస్టమర్లు అందరికి ఇదో పెద్ద అవకాశమని తెలిపారు. మొదటిసారి జరిగే సౌత్‌కాన్‌లో 64 అంశాలపై విజ్ఞానాన్ని చర్చలు జరుగుతాయని, ఆర్కిటెక్చర్, డెవలప్‌మెంట్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తామని పేర్కొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న అమరావతి రియల్టర్లుకి ఈ సదస్సు ఉపయోగపడుతుందని తెలిపారు. జెఎల్‌ఎల్ అనే మల్టీనేషనల్ కంపెనీ రూపొందించిన నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్‌పై ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరామని, 24న ప్రారంభమయ్యే సౌత్‌కాన్‌లో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారని చెప్పారన్నారు. ఆంద్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు శ్వేతపత్రంలో వుంటాయన్నారు. ఈ సందర్భంగా సౌత్‌కాన్-2024 బ్రోచర్‌ను క్రెడాయ్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో క్రెడాయ్ నేషనల్ జాయింట్ సెక్రటరి బి.రాజా శ్రీనివాస్, ఎపీ ప్రెసిడెంట్ వై.వి.రమణారావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, సౌత్‌కాన్ కన్వీనర్ డి.రాంబాబు, క్రెడాయ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News