Breaking News

రెవిన్యూ, పోలీసు , ఆర్ ఎం సీ ఫ్రెండ్లి క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన మంత్రి దుర్గెష్

-మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో తోడ్పాటునిస్తాయి.
– మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
యువతలో క్రమశిక్షణ మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో తోడ్పాటునిస్తాయని , అదే విధంగా ఉద్యోగుల్లో ఒత్తిడిని జయించే విధంగా క్రీడలు దోహదం చేస్తాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీస్ గ్రౌండ్ లో రెవెన్యూ, పోలీస్, పురపాలక శాఖ ల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యువత నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ క్రమశిక్షణతో జీవితాన్ని ఆచరణ సాధ్యమయ్యేలా మలుచుకోవాలన్నారు. బాలాజీ వారి సహచర మిత్రులు  మంచి టోర్నమెంట్ ను పెట్టినందుకు వారిని అభినందిస్తున్నా నన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు  కార్పొరేట్, గవర్నమెంట్ సెక్టార్   పనిచేస్తున్న ఉద్యోగులు ఈ టోర్నమెంట్ నిర్వహణ ఖచ్చితమైన ప్రణాళికతోనే సాధ్యమైందన్నారు. తొలి నుంచి  కవులకు కళాకారులతో పాటు క్రీడాకారులకు కూడా రాజమహేంద్రవరం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు . ఇక్కడి నుంచి అనేకమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు  పోలీసు శాఖ కూడా ముందుకు రావడం ముదాహం  అన్నారు. యువత శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలన్నారు. ఆ దిశగా సాగుతున్న ఈ టోర్నమెంట్ కు నా వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో  స్టేడియం ఏర్పాటు చేయాలని  మిత్రులు కోరడం జరిగిందన్నారు.  దిశగా రాజమహేంద్రవరంలో  2027 పుష్కరాలు నాటికి రాజమహేంద్రవరంలో క్రీడ మైదానం ఏర్పాటుకు   తనతో పాటు స్థానిక  శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ వారి నేతృత్వంలో  బృహత్తర కార్యాచరణతో  ప్రణాళిక తో ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి తో చర్చించి  ముందుకు వెళ్తామన్నారు. ఆధ్యాత్మిక పరమైన టూరిజమే కాకుండా ఈకో టూరిజం, పర్యాటకులను ఆకర్షించే విధంగా  పర్యాటక రంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి త్వరలో   అమలు చేసే దిశగా  ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ బ్యాటింగ్ చేస్తూ క్రికెట్ టోర్నీ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ  ఎల్. చెంచి రెడ్డి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. నిత్యం వత్తిడిలో గ డిపే ఉద్యోగు లకి ఇటువంటి పోటీలు నిర్వహించాలని నిర్ణయించిన కలెక్టర్, ఎస్పి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నీ లో ఆయా శాఖల అధికారులు సిబ్బందికి యువ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *