విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగష్టు 8 వ తేది రాత్రి విజయవాడ బందర్ రోడ్డు లో వున్న అంబేద్కర్ విగ్రహం ముందు లిఖించబడిన “బాబా సాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహా శిల్పం-ఆవిష్కరణ కర్త శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు తేదీ 19-01-2024” అను అక్షరాలలో “శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ” అను అక్షరములను కొందరు వ్యక్తులు తొలగించడం జరిగింది. పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే అంబేద్కర్ విగ్రహం సందర్శించి విచారణ చేపట్టడం జరిగింది. అయితే కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు దీనిని వక్రీకరించి కొందరు వ్యక్తులు విగ్రహ ధ్వంసానికి పాల్పడినట్లు, డా.బి.ఆర్. అంబేద్కర్ గారిని అవమానించినట్లుగా దుష్ప్రచారం చేస్తూ కొన్ని సామాజిక వర్గాలను, దళిత సంఘాలను రెచ్ఛ గొడుతూ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. దళిత సంఘాలు ఇటువంటి వక్రీకరించబడిన సమాచారాన్ని, అబద్దపు ప్రచారాన్ని నమ్మవద్దని పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …