-కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుల మంజూరుపై కేబినెట్ నిర్ణయంపై మీడియాకు వివరించారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రైల్వేలు, సమాచార- ప్రసార, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అత్యంత ప్రాధాన్యతతో చేపట్టిన పాండురంగాపురం – భద్రాచలం – మల్కన్‌గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును గిరిజన ప్రాంతాల ద్వారా నూతన రైలు మార్గాన్నిఅందిస్తూ ఇది అసన్సోల్ మరియు వరంగల్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ జునాగర్హ – నబరంగ్‌పూర్-జీపూర్-మల్కన్‌గిరి-భద్రాచలం-పాండురంగాపురం మధ్య అనుసంధానంను అందజేస్తుంది. ఈ కొత్త రైలు మార్గం జునాగఢ్-నబరంగ్‌పూర్, మల్కన్‌గిరి-భద్రాచలం-పాండురంగాపురం మధ్య 290 రూట్ కిలోమీటర్ల మేర రూ.7383 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ఈ విషయం పై మంత్రి న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మరియు హైదరాబాద్ మీడియాతో వర్చువల్‌గా ఈరోజు అనగా 10 ఆగస్ట్ 2024న సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మరియు ఇతర సీనియర్ అధికారులతో పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని కూడా పేర్కొన్నారు. ఇది ఉత్తర మరియు తూర్పు భారతదేశానికి అదనపు రైలు కారిడార్ అవుతుందని దక్షిణ భారతదేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గును వేగంగా చేరవేయడానికి , అల్యూమినియం మరియు ఇనుప ఖనిజ పరిశ్రమలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడం లో ప్రయోజనకారిగా సహాయపడుతుంది. ఈ కొత్త లైన్ ఆంధ్ర మరియు తెలంగాణలలో వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ను కూడా అందిస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న విజయవాడ-విశాఖపట్నం-భువనేశ్వర్- కోల్‌కతా కోస్తాతీరప్రాంతానికి నూతనంగా నిర్మిస్తున్న వరంగల్-భద్రాచలం-మల్కన్‌గిరి- జయ్‌పూర్ – టిట్లాగఢ్‌కు అదనపు రైలు మార్గాన్ని అందిస్తుంది .
గతంలో వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రభావితమైన కలహండి , నబరంగ్‌పూర్ , కోరాపుట్ , రాయగడ , మల్కన్‌గిరి గిరిజన జిల్లాలకు ఈ లైన్ అనుసంధానాన్నిఅందిస్తుంది. ప్రస్తుతం ఈ జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి మరియు శాంతి పునరుద్ధరణ జరుగుతోంది. ఈ కొత్త లైన్ కారిడార్ పైన పేర్కొన్న ఒడిశా మరియు తూర్పు గోదావరి (ఆంధ్రప్రదేశ్) & భదాద్రి కొత్తగూడెం (తెలంగాణ) జిల్లాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తూంది. ఈ కారిడార్ మహానది బొగ్గు క్షేత్ర ప్రాంతాల నుండి మధ్య & దక్షిణ భారతదేశంలో ఉన్న పవర్ ప్లాంట్లకు త్వరిత అనుసంధానాన్ని అందిస్తుంది.
కొత్త రైల్వే లైన్ విపత్తుల సమయంలో ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉపయోగపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. తుఫానుల సమయంలో హౌరా-విజయవాడ తీర మార్గంలో ప్రస్తుతం ఉన్న మార్గాల అనుసంధానం దెబ్బతింటే ఈ ప్రత్యామ్నాయ కొత్త రైల్వే లైన్ ఒడిశాలోని వివిధ జిల్లాలకు అనుసంధానాన్ని అందిస్తుంది. ఇది ఈ ప్రాంతానికి ఆహార ధాన్యాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు మరియు సిమెంటును సులభంగా అందించేందుకు కూడా ఉపయోగపడుతోంది. ఈ కొత్త రైల్వే లైన్ ద్వారా బస్తర్ ప్రాంతం నుండి దక్షిణ భారతదేశానికి 124 కి.మీ దూరం తగ్గుతుంది మరియు రాజమండ్రి & విశాఖపట్నం వంటి రద్దీ కారిడార్లను దాటవేస్తూ ప్రత్యామ్నాయ మార్గంగా కూడా పని చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ 1 కోటి పనిదినాల ఉపాధిని సృష్టిస్తుంది మరియు 3 కోట్ల 80 లక్షల చెట్ల పెంపకానికి సమానమైన 267 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది.