Breaking News

ఎయిడ్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రెండు నెల‌ల పాటు ” మీకు తెలుసా ” ప్ర‌చార కార్య‌క్ర‌మం

-ఈనెల 12న సిద్ధార్ధ ఆర్ట్స్ క‌ళాశాల నుండి ర్యాలీని ప్రారంభించ‌నున్న ఎపి శాక్స్ పీడీ డాక్ట‌ర్ ఎ. సిరి ఐఎఎస్‌
-రాష్ట్ర స్థాయి ప్ర‌చార కార్య‌క్ర‌మానికి అన్ని ఏర్పాట్లూ చేసిన ఎపి శాక్స్ అధికారులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్‌ఐవి మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల‌(Sexually Transmitted Infection-STI) గురించి సమాచారాన్ని అందించేందుకు, ప్ర‌జ‌ల్లో అవగాహన పెంపొందించేందుకు రెండు నెలలపాటు నేకో (National Aids Control Society-NACO) నేతృత్వంలో ” మీకు తెలుసా ” రాష్ట్ర‌స్థాయి “ఇంటెన్సిఫైడ్ ఐఇసి క్యాంపెయిన్” కార్య‌క్ర‌మాన్ని ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్ర‌ణ సంస్థ‌ (Aadhra Pradesh State Aids Control Society-APSACS) ప్రాజెక్టు డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ. సిరి విజ‌య‌వాడ‌లో ప్రారంభించ‌నున్నారు. ఇందుకోసం ఎపిశాక్స్ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహించడం జ‌రుగుతోంది. రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మంలో భాగంగా ఈనెల 12న ఉద‌యం 8 గంట‌ల‌కు సిద్ధార్ధ ఆర్ట్స్ కాలేజీ నుండి భారీగా నిర్వ‌హించే ర్యాలీ కార్య‌క్ర‌మాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంత‌రం కాలేజీ ఆడిటోరియంలో నిర్వ‌హించే మీకు తెలుసా స‌భా కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ గుమ్మ‌ళ్ల సృజ‌న‌, ప్ర‌జా ప్ర‌తినిధులు, ఎపి శాక్స్ అధికారులు పాల్గొంటారు. జిల్లా స్థాయిలో కూడా ర్యాలీలు నిర్వహిస్తారు. ప్ర‌ముఖులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, కమ్మూనిటీ ఛాంపియన్లు, విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీల్లో పాల్గొంటారు. జనాభాలో హెచ్ ఐవి మరియు సుఖ వ్యాధులు(ఎస్టీఐ) ల గురించి పరిజ్ఞానం, అవగాహన పెంపొందించండానికీ, సురక్షిత పద్ధతులు, హెచ్ ఐవి ఉన్నవారి పట్ల వివక్ష తగ్గించేందుకు, ప్రజ‌ల్లో అవగాహన కలిగించి తద్వారా ఎక్కువ మంది హెచ్ ఐవి పరీక్షలు చేసుకునేందుకు ముందుకొచ్చేలా నేకో ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అవగాహనా కార్యక్రమాల్ని చేప‌డ‌తారు. రాష్ట్రంలో ఈ ఇంటెన్సిఫయిడ్ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని మీకు తెలుసా ? అన్న నినాదంతో ఎపి శాక్స్ చేప‌డుతోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో హెచ్ ఐవి తో జీవిస్తున్న వారి సంఖ్యలో భారతదేశం రెండోది. దేశంలో హెచ్ ఐవి ప్రాబల్యం తక్కువగా ఉన్నప్పటికీ, 2023 నాటికి సుమారు 25.44 లక్షల మంది పిఎల్ హెచ్ ఐవితో జీవిస్తున్నారు. 2022-23 సంవత్సరంలో 68,450 క్రొత్తగా HIV కి గురికావడము జరిగింది. జిల్లాల వారీగా క్రొత్తగా హెచ్ ఐవి బాధితుల‌ పెరుగుదల చూస్తే 2007లో 156 గా బాధితుల సంఖ్య 2022 నాటికి 178కి పెరిగింది. మన రాష్ట్రంలో 2014-15 సంవత్సరములో 25,649 మంది క్రొత్తగా ఎఆర్ టి మందుల కోసం న‌మోదు చేసుకోగా 2023-24 లో కేవ‌లం 14,257 మంది మాత్రమే కొత్త‌గా న‌మోదు చేసుకున్నారు. 2024జులై నాటికి 2,22,425 మంది ఎఆర్‌టి మందులు వాడుతుంటే, వారిలో 10,104 మంది 15 నుండి 25 ఏళ్ల‌ వయస్సు వారున్నారు. ART మందులు వాడేవారిలో HIV వైరస్ 96 శాతం మందిలో అదుపులో ఉంది. అంటే వీరిలో వైరస్ ఒకరినుండి ఒకరికి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అయినప్పటికీ, 2004 నుండి ఇప్పటివరకు 1,48,270 మంది HIV బారిన పడి మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం. అందుకే అనుమానం ఉన్న‌వారంతా సిగ్గు ప‌డ‌కుండా త‌ప్ప‌నిస‌రిగా ర‌క్త ప‌రీక్ష చేయించుకుని, ఒక వేళ హెచ్ ఐవి పాజిటివ్ అని బ‌య‌ట‌ప‌డితే ఎఆర్‌టి సెంట‌ర్ల‌లో పేర్ల‌ను న‌మోదు చేసుకోవ‌డం ద్వారా ఉచితంగా మందులు తీసుకుని ఈ వైర‌స్ నుండి పూర్తిగా కోలుకుని ప్రాణాల మీద‌కు రాకుండా కాపాడుకోవ‌చ్చ‌ని ఎపి శాక్స్ అధికారులు కోరుతున్నారు.
గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి HIV ఎలా సోకుతుంది, ఎలా నివారించ వచ్చు, వ్యాధి సోకినా వారి పట్ల ప్రేమతో కలసి మెలసి ఎలా జీవించాలనే విష‌యాల్ని తెలియ చేస్తారు. గ్రామాధికారులు, విద్యార్థులు ఆరోగ్య కార్యకర్తలు ఈ స‌భ‌ల్లో పాల్గొంటారు. కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాలద్వారా వీడియోలు, మీమ్స్, వంటి వాటి ద్వారా అవగాహన కల్పిస్తారు. పట్టణాలలోని అతి జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటి-ఇంటి ప్రచారం చేస్తారు. గ్రూఫు మీటింగులు పెట్టి HIV గురించి చర్చిస్తారు. HIV వ్యాధిగ్రస్తులతో మాట్లాడించి వారు ఎలా ఆరోగ్యాంగా జీవిస్తున్నారో తెలియ చేస్తారు. హెచ్ ఐవి బాధితుల ప‌ట్ల వివక్ష క‌న‌బ‌ర్చ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తే వారు కృంగిపోకుండా సంతోషంగా బ‌త‌క‌వ‌చ్చ‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తారు. రెడ్ రిబ్బను క్లబ్బుల ద్వారా విద్యార్థులు వారి స్నేహితులకు అవగాహనా కార్యక్రమాలు చేపడతారు. వారి మిత్రులలో, ఎవరైనా నడవడిక వేరుగా ఉంటే వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ జరిగేలా చూస్తారు. రాష్ట్రంలో ఉన్న అంబుడ్స్మన్ మరియు కంప్లైట్స్ ఆఫీసరు లకు శిక్షణా కార్యక్రమాల్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు. . HIV మరియు AIDS (ప్రివెన్షన్ &కంట్రోల్) యాక్టు -2017 సక్రమంగా అమలయ్యేలా వారికి అవగాహన కల్పిస్తారు. సంబంధిత ఇత‌ర శాఖ‌ల ప్రతినిధులతో ఇప్ప‌టికే ఎపి శాక్స్ అధికారులు స‌మావేశాన్ని ఏర్పాటు చేసి వారి సంస్థలలో HIV గురించి ప్రణాళికాబద్ధంగా అవగాహన కల్పించే విధంగా తర్ఫీదునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *