విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత మాజీ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి జయంతి కార్యక్రమం శనివారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వి.వి.గిరి భారత రాష్ట్రపతిగా, ఉప రాష్ట్రపతిగా, పలు రాష్ట్రాల గవర్నర్ గా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నెతెచ్చిన మహనీయుడని కొనియాడారు. దేశానికి వీరు చేసిన సేవలకు గాను భారత రత్న అవార్డుతో వీరిని గౌరవించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడా సురేష్, అన్సారీ, నరహరశెట్టి నరసింహ రావు, లక్కరాజు రామారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News