Breaking News

అమలాపురంలో జరిగే కార్యక్రమంలో రబీ సీజన్లో ధాన్యం సేకరణ బకాయిలు విడుదల

-నేడే (సోమవారం) 1147 మంది రైతులకు చెల్లించాల్సి ఉన్న పెండింగ్ బకాయిలు రూ.27.71 కోట్లు విడుదల
-పాల్గొననున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
-కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో జరిగే కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ వారి చేతుల మీదుగా తూర్పు గోదావరి జిల్లా లో రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి సంబంధించి 1147 మంది రైతులకు చెల్లించాల్సి ఉన్న పెండింగ్ బకాయిలు రూ.27 కోట్ల,71 లక్షలు విడుదల చెయ్యడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2023-24 రబీ సీజన్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం సేకరణ పెండింగు బకాయిలను రూ. 202.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో రైతులకు చెల్లించడం ద్వారా రైతులకు ఊరట లభించిందనీ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గత రబీ సీజన్లో 22,606 మంది రైతులు నుంచి 2,28,423 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చెయ్యడం జరిగిందన్నారు . ఇందు నిమిత్తం రైతుల కు మొత్త రూ.498.65 కోట్లు చెల్లించాల్సి ఉండగా గత ప్రభుత్వం హయంలో సుమారు 12 వేల మంది రైతులకు రూ.296 కోట్ల 31 లక్షలని రైతుల ఖాతాకు జమ చేశామన్నారు. సుమారు 10,560 మంది రైతులకు బకాయిలుగా చెల్లించాల్సి ఉన్న రూ.202.కోట్ల 34 లక్షలలో గత నెలలో రూ.174.63 కోట్ల ను రైతుల ఖాతాకు జమ చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా 1147 మంది రైతులకు చెల్లించాల్సి ఉన్న రూ.27.71 కోట్లు సోమవారం రైతులకు పౌర సరఫరాల శాఖ మంత్రి ద్వారా చెల్లించనున్నట్లు తెలిపారు. గత రబీ సీజన్లో సేకరణ చేసిన ధాన్యం కొనుగోలు కు సంబంధించి రైతులకు చెల్లింపులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *