Breaking News

ఇంపికాప్స్ ఆధ్వర్యంలో “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్”

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యం తో”ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ (ఇంపికాప్స్) ఆధ్వర్యంలో” విజయవాడ,బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపికాప్స్ పంచకర్మ హాస్పిటల్ లో ప్రతి నెల జరుగుతున్న “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్” కార్యక్రమంలో పాల్గొన్న సంస్ధ డైరెక్టర్ డా. వేముల భాను ప్రకాష్ మాట్లాడుతూ.ఇటీవల వచ్చిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ అమెండేమెంట్స్ యాక్ట్ 2023 ప్రకారం ఆయుర్వేద వైద్యులు వారి సర్టిఫికేట్ రెన్యువల్ 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలంటే ఈ 5 సంవత్సరాలలో కoటిన్యూయాస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో పాల్గొని50 గంటల క్రెడిట్ స్కోర్ ఉండాలి అని చట్టంలో పొందుపరిచారు కనుక ఇటువంటి కార్యక్రమంలు ఎక్కువగా డాక్టర్స్ అసోసియేషన్ లు, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరగాలన్నారు. ఆరోగ్య శాఖా మంత్రి  సత్యకుమార్ యాదవ్ సహకారం తో రాష్ట్రంలో ఆయుష్ గ్రాడ్యుయేట్ లకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మరియు స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ ఏర్పాటుకు ఆయుష్ కమీషనర్ డా. యస్. బి.రాజేంద్రకుమార్ కృషి కి ధన్యవాదాలు తెలిపారు. వీటి ద్వారా బోగస్ ఆయుర్వేద వైద్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది. సామాజిక మాధ్యమాలలో ఆయుర్వేదం తో చేస్తున్న తప్పుడు ప్రచారాలను నియంత్రణ చేసే అవకాశం ఉంటుంది. 2018 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆయుష్ వైద్యాలకు స్థానం కలిపించి, ప్రజలు వారికి నచ్చిన వైద్యం ఎంచుకునే స్వేచ్ఛ కలిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై దృష్టి సారించాలని కోరారు.సెప్టెంబర్ నుండి పబ్లిష్ చేస్తున్న ఆయుర్వేద విజ్ఞానం, ఆయుర్వేద విషయాలతో కూడిన మాసపత్రిక” సెపా డైరి” లో ప్రతి నెలా ఈ కార్యక్రమంలో తెలిపిన అనుభవాలను సంకలనం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ లో ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి మచిలీపట్నం లో ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలిగా 25 సంవత్సరం ల నుండి ప్రజలకు సేవ చేస్తున్న డా.యం.శ్రీవిద్య చర్మవ్యాధులు పై గ్రంధస్థంగా ఉన్న మరియు తన అనుభవo లోని చికిత్సలను సభలో తెలిపారు. ఈ కార్యక్రమంకి సమన్వయ కర్తగా డా. పమ్మి సూర్యకుమార్ వ్యవహరించారు.డా. ఆదర్శ్ సహకారం అందించారు. ఈ సందర్భంగా డా. యం.శ్రీవిద్య ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *