Breaking News

చేనేత వస్త్రాల అమ్మకమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత వస్త్రాల అమ్మకమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవితగారు తెలిపారు. నగరంలోని మారిస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఎగ్జిబిషన్ లో ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి నేతన్నలను పలుకరించారు. ఏయే రాష్ట్రాల నుంచి వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేశారు.. రోజూ ఎంత మేర అమ్మకాలు అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. ఈ నెల ఏడో తేదీన గాంధీ బునకర్ మేళా పేరుతో చేనేత వస్త్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారన్నారు. ఈ వస్త్ర ప్రదర్శన ఈ నెల 20 తేదీ వరకు నిర్వహించాలని తొలుత నిర్ణయించామని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఎగ్జిబిషన్ ను మరో వారం రోజుల పాటు పొడిగించనున్నట్లు మంత్రి తెలిపారు. చేనేత వస్త్రాల అమ్మకాల్లో దళారుల ప్రమేయం లేకుండా, నేతన్నల కు మేలు కలగజేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలు మరింత పెరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వస్త్ర ప్రదర్శనలు(ఎగ్జిబిషన్ లు) నిర్వహించినున్నట్లు తెలిపారు‌. నేతన్నలకు శిక్షణ ఇచ్చి ఈ కామర్స్ లో చేనేత వస్త్రాలు విక్రయించే లా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేతన్నలకు 365 రోజులు పని కల్పించడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

మరో వారం పాటు ఎగ్జిబిషన్ పొడిగింపు
ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే ఆనందంగా ఉందని మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేశారు. రోజుకు రూ.20 లక్ష లో మేర అమ్మకాలు జరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకొని మరో వారం రోజుల పాటు ఎగ్జిబిషన్ పొడిగిస్తున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు.

చీరలు కొనుగోలు చేసిన మంత్రి
వస్త్ర ప్రదర్శనను పరిశీలించడానికి మంత్రి సవిత మూడు చీరలు కొనుగోలు చేశారు. ఆప్కో స్టాల్ దగ్గర 2 చీరలు, చీరాల స్టాల్ దగ్గర డ్రెస్ మెటీరియల్ మంత్రి కొనుగోలు చేశారు. చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి కూడా చీరలు కొనుగోలు చేశారు.

వస్త్ర ప్రదర్శన అద్భుతం
వస్త్ర ప్రదర్శనకు వచ్చిన కొనుగోలు దారులతో మంత్రి సవిత ముచ్చటించారు. వస్త్ర ప్రదర్శన వల్ల మేలు కలిగిందా..అన్న మంత్రి ప్రశ్నకు కొనుగోలు దారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శన వల్ల నాణ్యమైన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన బాగుందని, ఇకపై మరిన్ని చేనేత వస్త్ర ప్రదర్శనలు నిర్వహించనున్నామని మంత్రి సవిత తెలిపారు.

సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన మంత్రి
కొనుగోలుదారులకు, నేతన్నలకు ఆహ్లాదం కలిగించేలా రోజూ ఆడిటోరియంలో ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేనేత ప్రదర్శనను పరిశీలించడానికి మంత్రి సవిత సోమవారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం పలువురు కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పవన్ మూర్తి, జేడీ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *