Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారిని నేటి సోమవారం ఉదయం రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ వి ఐ పీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

మొదటగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ … తెలుగు ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా,సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నానని, గతంలో జరిగినటువంటి అన్యాయాల వలన ఇబ్బంది పడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలని ప్రజలందరూ ఏకతాటిపై ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేశారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా తిరుమలలో నేడు లక్ష మందికి పైగా ముక్కులు తీర్చుకోవడం స్వయంగా చూస్తున్నానని, గత ఐదు సంవత్సరాలుగా తీవ్రంగా నష్టపోయామని 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళామని, నష్టపోయిన కాలాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడం కోసం మెరుగ్గా ముందుకెల్తూ భావితరాలకు మంచి చేయాలని లక్ష్యంతో గతంలో 2020 విజన్ తో ముందుకొచ్చారని, నేడు 2047 అనే విజన్తో ముఖ్యమంత్రి ముందుకెళుతున్నారని తెలిపారు. రాష్ట్రమే కాదు దేశం కూడా మున్ముందు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారని తెలిపారు. తాను కూడా ముఖ్యమంత్రి గారిని అనుసరిస్తూ రెవెన్యూ శాఖ తరపున రెవెన్యూ సదస్సులను పెట్టి గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్యాక్రాంతం అయినటువంటి భూములకు సంబంధించి రెవెన్యూ సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి 45 రోజులపాటు రెవెన్యూ సదస్సు నిర్వహించి అందులో రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి భయపడుతున్నారని సమాచారం తమ వద్దకు వచ్చిందని, ప్రజలను ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే అట్టివారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ పెట్టి వారి నుండి ఫిర్యాదులను తీసుకొని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. వందల సంవత్సరాలుగా అన్యాక్రాంతమైన అసైన్మెంట్ ల్యాండ్స్ ను పరిశీలించి వాటికి పరిష్కారం చూపే దిశగా ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకొనుటకు తాను, రెవెన్యూ శాఖ మంత్రి వచ్చామని ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళుతున్నారని తాము కూడా వారి మార్గంలోనే వెళ్లి , ప్రజలు నచ్చే, మెచ్చే విధంగా పరిపాలనను కొనసాగిస్తామని, గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటులు సరిదిద్దుకుంటూ ముందుకెళతామని తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలలో ఒక్క మెగా వాట్ విద్యుత్తు ఉత్పత్తి ఎక్కడ కూడా రాష్ట్రంలో జరగలేదని, విద్యుత్ చార్జీలను పరిశీలిస్తే ఏడు ఎనిమిది సార్లు పెంచారని, ప్రజలపై పెనుబారాన్ని మోపారని, రైతులకు మెరుగైన విద్యుత్ సౌకర్యం, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తునిస్తు వినియోగానికి తగ్గ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని రైతులు నష్టపోయే విధంగా ఏ విధమైన నిర్ణయం తీసుకోబోమని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *