Breaking News

హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి / ఎయిడ్స్ నియంత్రణ మండలి మరియు తిరుపతి జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ మండలి మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో “మీకు తెలుసా “IEC హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం మొదటి రోజున తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ లైన్ డిపార్ట్మెంట్ HODs, మరియు, O. శ్రీనివాస్ రెడ్డి సార్ , జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి(DLATO ),DAA, తిరుపతి జిల్లా చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం స్టాఫ్ , స్వచ్ఛంద సేవ సంస్థల సభ్యులు గ్రాసం, పాస్ సంస్థ… మొదలైనవి ఈ ప్రోగ్రాం లో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భం గా డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి, DLATO గారు మాట్లాడుతూ హెచ్ఐవి మరియు లైంగికంగాసంక్రమించే అంటువ్యాధుల గురించిసమాచారాన్ని అందించేందుకు, ప్రజల్లో అవగాహన పెంపొందించెందుకు 2 నెలలపాటు నాకో (NACO) నేత్రత్వం లో మీకు తెలుసా జిల్లా స్థాయి ఇంటెన్సిఫైడ్ ఐఇసి క్యాంపెయిన్ కార్యక్రమాన్ని 12వ తేదీ న , ఆగష్టు 2024 తిరుపతి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టుఅధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు అని తెలియజేసారు . అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12నఆగష్టు ఉదయం 12 గంటలకు కార్యక్రమాన్ని IEC పోస్టర్ లు కలెక్టర్ ఆఫీస్ నందు ప్రారంభించారు .జనాభాలో హెచ్ ఐవి మరియు సుఖవ్యాధులు(ఎస్టీఐ) ల గురించి పరిజ్ఞానం, అవగాహన పెంపొందించండానికీ, సురక్షిత పద్ధతులు పెంపొందించడానికీ, హెచ్ ఐవి ఉన్నవారి పట్ల వివక్ష తగ్గించేందుకు, ప్రజల్లో అవగాహన కలిగించి తద్వారా ఎక్కువ మంది హెచ్ ఐవి పరీక్షలు చేసుకునేందుకు ముందుకొచ్చేలా నేకో ఆదేశాలకనుగుణంగా తిరుపతి జిల్లాలలో అవగాహనా కార్యక్రమాల్ని చేపడతారు. , హెచ్ఐవి మరియు ఎయిడ్స్ (ప్రివెన్షన్ కంట్రోల్) యాక్టు -2017 సక్రమంగా అమలయ్యేలా వారికి అవగాహన కల్పిస్తారు అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *