గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి లోని యంటీయంసీ కార్యాలయ పరిధిలో జరుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాధ్ లకు సోమవారం మునిసిపల్ కమిషనర్ షేక్.అలీం బాష పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. మంగళగిరి పరిధిలో 11 విలీన గ్రామాలు , తాడేపల్లి పరిధిలో పది విలీన గ్రామాలు వున్నాయని తెలిపారు. పట్టణంలోని ప్రజలకు అందిస్తున్న నీటి సరఫరా వివరాలను తెలిపారు. అమృత్ 2.0 పధకం క్రింద నీటి సరఫరా చేయాల్సిన ప్రాంతాల వివరాల గురించి వివరిస్తూ దీనికి సంబంధించి డీపీఆర్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వీధి దీపాలు , రోడ్ల పరిస్థితులు , అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్వహణపై వివరాలను తెలియజేశారు. యూజీడీ పనుల పూర్తికై ఇంకనూ చేపట్టవలసిన ప్రాజెక్టు వివరాలను ఈ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. రోడ్ల నిర్వహణ , మరమ్మత్తు చేపట్టవలసిన రోడ్ల వివరాలను తెలిపారు. జిల్లాలో ఉన్న వాటర్ బాడి లను అమృత్ పధకం క్రింద రీజునువేషన్ చేపట్టేందుకు అవసరమైన నిధుల గురించి వివరించారు. మంగళగిరి పరిధిలోని మూడు అన్న క్యాంటీన్ల రేస్టోరేషన్ పై , అలాగే పెదవడ్లపూడిలో ఒకటి , ఉండవల్లిలో రెండు క్రొత్త అన్న క్యాంటీన్లు మంజూరు అయినట్లు తెలిపారు. అలాగే సిటీ బ్యూటిఫికేషన్ పై చేపట్టిన పనులను వివరించారు. ప్రజారోగ్యం మరియు శానిటేషన్ పై చేపడుతున్న పనులను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. వర్షాకాలం నేపధ్యంలో కీటక జనిత రోగాలు నివారించేందుకు ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని , వీధి కుక్కల బెడద నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ కు సూచించారు . అలాగే వీధుల్లో పశు సంచారం లేకుండా నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో ఆగస్టు 1 వ తేది నుండి నవంబర్ 10 వ తేది వరకు వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను మునిసిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ కు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డీడీ సోషల్ వెల్ఫేర్ మధుసూధన రావు , మార్కెటింగ్ శాఖ ఏ.డి రాజబాబు, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ , నగరపాలక సంస్థ ఎస్.ఈ నాగమల్లేశ్వర రావు, డిప్యూటీ సిటీ ప్లానర్ అశోక్ రాజు , అసిస్టెంట్ సిటీ ప్లానర్ అంజన జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …