-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటింటికీ కుళాయి, “డ్రింక్ ఫ్రమ్ టాప్” అంశంపై విజయవాడ నగరపాలక సంస్థ సోమవారం నుండి ఇంటింటి సర్వే నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం గాంధీనగర్ లో ఇంటింటికీ కుళాయి కి జరుగుతున్న సర్వే తీరును పరిశీలించారు. సర్వే చేస్తున్న అడ్మిన్ సెక్రటరీలు, ఎమినిటీ సెక్రటరీలు సర్వే చేసిన అంశాలపై నివేదికను సమగ్రంగా పొందుపరచాలని తగు సూచనలు సూచించారు. ఇంటింటికి కుళాయి అనే నేపథ్యంతో జరుగుతున్న ఈ సర్వేలో ప్రతి అసెస్మెంట్ కి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ప్రతి కనెక్షన్ కి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, అను అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత యాప్ లో నమోదు చేస్తున్నారు. ఈవారం చివరికల్లా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 2,17,083 అసెస్మెంట్ లకు సర్వే ని పూర్తి చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. శ్రీనివాస్, అడ్మిన్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.