-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
78వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఉత్తర్వుల మేరకు 15-08-2024 తేదిన (గురువారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన యెడల, లేదా షాపులను తెరిచియుండి మటన్, చికెన్ మరియు చేపలను అమ్మిన యెడల చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోనబడునని కమిషనర్ ఆదేశించారు. కావున మటన్, చికెన్, చేపలు హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులు అన్ని షాపులు మూసి వేయవలెనని ఆదేశించడమైనది.