-మున్సిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య
-మన దేశంలో యువత దేశ భక్తి భావన పెంపొందించుకోవాలి: ఎస్పి సుబ్బరాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం వరకు టూరిజం మరియు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తిరుపతి నగరపాలక కమీషనర్ నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎస్పీ సుబ్బ రాయుడు, సంబంధిత అధికారులతో కలసి పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక కమీషనర్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వాహణకు ముందు మన జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవనాల పైన మాత్రమే ఎగురవేసేవారమని స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తీ చేసుకున్న నేపథ్యంలో గౌ.ప్రధాన మంత్రి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని, ర్యాలీలు, పోటీలు, మారథాన్ లు వంటివి జరిపి తద్వారా ప్రజలలో అవగాహన దేశ భక్తి, ఐకమత్యం పెంపొందించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు.
ఎస్.పి. మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉందని ప్రతి ఒక్క యువత దేశ భక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో లక్ష్యాలను ఏర్పరుచుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు టూరిజం శాఖ అధికారి రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపెంద్రనాత్ రెడ్డి, ప్రొఫెసర్ రజనీ, విద్యార్థిని విద్యార్థులు, ఎన్సీసి క్యాడెట్లు, సంబందిత అధికారులు, విద్యార్థులు, పాల్గొన్నారు.