Breaking News

హర్ ఘర్ తిరంగా అంటూ ర్యాలీలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర, సబ్ కలెక్టర్ భవాని శంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అంటూ విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సర్కిల్ వన్ పరిధిలో గల విజయవాడ నగరపాలక సంస్థ నందు, కమిషనర్ ధ్యానచంద్ర, సబ్ కలెక్టర్ భవాని శంకర్ సర్కిల్ టు పరిధిలోగల బి ఆర్ టి ఎస్ రోడ్, సరదా కాలేజ్ నందు, సర్కిల్ 3 పరిధిలోగల విశాలాంధ్ర రోడ్డు నందు జోనల్ కమిషనర్ 3 శివరామకృష్ణ, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలందరూ ప్రతి ఇంట్లో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ తమ దేశభక్తిని చాటి చెప్పేందుకు ఒక సువర్ణ అవకాశమన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సంతకాల సేకరణ వద్ద సంతకం చేసి తమ దేశభక్తిని చాటిచెప్పారు. తదుపరి శాఖధిపతులందరూ సంతకాల సేకరణ లో సంతకాలు చేసి ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర, సబ్ కలెక్టర్ భవాని శంకర్, సర్కిల్ 2 పరిధిలో గల బిఆర్టిఎస్ రోడ్ నందు శారదా కాలేజ్ వద్ద హర్ ఘర్ తిరంగా ఉంటూ ఏకేటిపి స్కూల్ విద్యార్థినీ విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో విద్యార్థులు 125 అడుగుల జాతీయ జెండాను పట్టుకొని నగర ప్రజలకు జాతీయ జెండా ప్రతి ఇంట్లో ఎగర వెయ్యాలని అవగాహన కల్పిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు కేంద్రంలోనే కాకుండా రాష్ట్రములో, నగరంలో, ఈ కార్యక్రమం చేయటం వల్ల చిన్నారుల్లో నగర ప్రజల్లో వారి దేశభక్తిని చాటి చెప్పే అవకాశాన్ని కలుగుతుందని, ప్రతి ఇంట్లో జాతీయ జెండాని ఎగరవేయటమే కాకుండా జండా గౌరవాన్ని కూడా ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవాలని అన్నారు. సర్కిల్ 3 పరిధిలో విశాలాంధ్ర రోడ్డు నందు జోనల్ కమిషనర్ 3 శివరామకృష్ణ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ ర్యాలీలో విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ (జనరల్) డాక్టర్ ఏ. మహేష్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) కేవీ సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. రత్నావళి అకౌంట్స్ ఎగ్జామినర్ చక్రవర్తి, అసిస్టెంట్ ఎకౌంట్స్ ఎగ్జామినర్ సుబ్బారెడ్డి, జోనల్ కమిషనర్లు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *