విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బుధవారం ఉదయం చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. రత్నవళి,జోనల్ కమిషనర్ 3 ఎస్ శివరామకృష్ణ విజయవాడ సర్కిల్ 3 పరిధిలో గల శివారు ప్రాంతమైన యనమలకుదురు, రామలింగేశ్వర నగర్ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. శివారు ప్రాంతాలలో పేరుకుపోయిన వ్యర్థాలను సత్వరమే తొలగించాలని, నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిపించాలని, సిబ్బందితో అన్నారు. తదుపరి రామలింగేశ్వర నగర్ లో గల చేపల మార్కెట్ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవటం గమనించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలని, కాలువలో వ్యర్ధాలు కలపరాదని అన్నారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …