తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగ సెలబ్రేషన్ లో భాగంగా వీరనారిమణులకు మరియు మాజీ సైనికులకు సన్మాన కార్యక్రమం ఈరోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వర్సిటీ ఇంచార్జీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి.ఉమ గారు మరియు గెస్ట్ ఆఫ్ హానర్ గా తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య ఐఎఎస్, డా.ఆర్. రమణ ప్రసాద్, ఆర్.డి, ఏ.పి.టి.డి.సి, కొలొనల్ అనుజ్ వాధ్వ, ఎమ్.కులశేఖర్, అడిషనల్ ఎస్పి, డా.పి. అంకయ్య, డైరెక్టర్, వే ఫౌండేషన్, ప్రొఫెసర్ ఎన్.రజనీ, రిజిస్ట్రార్, ఎస్ పి ఎమ్ వి వి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహనీయులు త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడం మరియు వారి విశిష్ఠ వ్యక్తిత్వాలు గురించి విద్యార్థినులకు విలువలను నేర్పటం. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎమ్ విద్యావతి మరియు స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జే.కాత్యాయని ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ సందర్భంగా, ఆచార్య ఉమ గారు మాట్లాడుతూ గర్ల్స్ బెటాలియన్ గురించీ లీడ్ తీస్కున్నారు, అండర్ గ్రాడ్యుయేట్ ఉంది కాబట్టి NCC పెట్టాలని రిక్వెస్ట్ చేశాను అని అన్నారు.
హరిపద్మ రాణి మాట్లాడుతూ తిరుపతిలో సామాన్యం జీవితం గడుపుతున్నారు ,జండ పండుగ సందర్భంగా ఈ వీర వనితలకు వేల వేల వందనాలు అని అన్నారు. ఎన్ మౌర్య మాట్లాడుతూ ఫెలిసిటేషన్ నిర్వహించి నన్ను ఆహ్వానించినందుకు ఎస్ పి ఎమ్ వి వి కి ధన్యవాదాలు ,సైనికులు తమ కుటుంబాన్ని విడిచిపెట్టి, మా కుటుంబాన్ని కాపాడుతూ సరిహద్దుల్లో పనిచేశారు అని ప్రసంగించారు.
Tags tirupathi
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …