-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పద్మావతి వసతిగృహంలో NTCP (COTPA ) పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పొగాకు వాడడం వల్ల పలువురు క్యాన్సర్ బారిన పడతారన్నారు. పొగాకు రహిత నగరంగా తిరుపతిని తీర్చి దిద్దుదాం అని అన్నారు. తిరుపతి DMHO Dr. శ్రీ హరి. నిసీది ప్రోగ్రామ్ ఆఫీసర్ Dr.నిత్య పద్మావతి మరియు ఇతర ప్రోగ్రాం ఆఫీసర్లు ANMS ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.