విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం దేశ వ్యాప్తంగా 78వ స్వాంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచనలతో బుధవారం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా జెండా పండగను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఔన్నత్యాన్ని, ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా, ప్రతిఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ పతాకాలు చేతబూని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఫ్లాగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాలను ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …