-పశ్చిమ సమగ్రాభివృద్దే లక్ష్యం
-ఎమ్మెల్యే సుజనా చౌదరి
-ఎన్నికల్లో శాసనసభ్యునిగా విజయం తరువాత తొలిసారిగా జెండా ఎగరవేసిన సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో జాతీయ జెండాను పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ తో కలిసి ఆవిష్కరించారు.2024 ఎన్నికల్లో తొలిసారిగా శాసనసభ్యునిగా విజయం సాధించిన సుజనా, జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పశ్చిమ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమితో కలిసి ఐక్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరి జీవితాలలో కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నానని సుజనా చౌదరి తెలియజేశారు. ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో పలువురు పాఠశాల విద్యార్థులకు ఎంపీ కేశినేని శివనాథ్, తో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి, పుస్తకాలను పంపిణీ చేశారు. బిజెపి నాయకులు వడ్లాని మాధవ్ ఆధ్వర్యంలో శంకర్ కేఫ్ వద్ద ఏర్పాటుచేసిన పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశి నేని శివనాద్ , ఎమ్మెల్యే సుజనా చౌదరి, హాజరై విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు.