– నగరంలో కోరి సెంటర్, జి జి హెచ్, సుబ్రహ్మణ్యం మైదానం లలో పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్లు.
– అన్న క్యాంటీన్ ప్రారంభించిన
– జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి,
– నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో నేడు మూడు అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం ఆవరణలోని అన్నా క్యాంటీన్ ను కలెక్టర్ పి. ప్రశాంతి.. నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ లలో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, కష్టజీవులు పేద వర్గాలు ప్రజలకు సంపూర్ణ ఆహారాన్ని అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ లను ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మూడు వేళల్లో అన్నా క్యాంటీన్ లో రు. 15/- రూపాయలకే భోజనం, అల్పాహారం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. టోకెన్లు జారీ చేసి తదుపరి ఆమేరకు ఆహారం అందించడం జరుగుతుందన్నారు నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పేదవాని ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు నేడు పునః ప్రారంభించుకుంటున్నామన్నారు. నగరంలో తొలి దశలో క్వారీ రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్, సుబ్రహ్మణ్య మైదానంలోని మూడు ప్రదేశాల్లో అన్న క్యాంటీన్ ను ప్రారంభించామని తెలిపారు. రు. 5/- రూపాయలకే అల్పాహారం, రు. 5/- రూపాయలకు భోజనం అందిస్తున్న ఈ అన్న క్యాంటీన్ ను పేద ప్రజలందరూ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్న ఎన్టీఆర్ “సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు” అనే నినాదంతో పేద ప్రజల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి కృషి చేశారన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా రు. 15 రూపాయలకే అల్పాహారంతో పాటు రెండు పూటల భోజనం సౌకర్యం పేదవారి ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు అన్న క్యాంటీన్ పునః ప్రారంభించుకోవడం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నా క్యాంటీన్ లో అల్పాహారాన్ని తీసుకోవడం జరిగింది. ఇటువంటి నాణ్యమైన భోజనాన్ని ప్రతిరోజు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజలకు రు. 5/- రూపాయలకే పేద ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా నగరంలోని క్వారీ రోడ్ సెంటర్ నందు, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోను, సుబ్రహ్మణ్యం మైదానం సెంటర్ నందు ఏర్పాటు చేసిన మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్డ్ లబ్ధిదారులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.