-2014 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చే ఆన్నా క్యాంటీన్ల శ్రీకారం
-నేడు ఐదేళ్ళ తరవాత మళ్లీ ప్రారంభించుకుంటున్నాం
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేదవానికి కూడు , గూడు, గుడ్డ కల్పించాలనే ఉద్దేశ్యంతో పార్టీ స్థాపించి, రూ.2 కిలో బియ్యం పథకం ప్రారంభించడం జరిగిందని, ఎన్టీఆర్ సిద్ధాంతంతో 2014-2019 సంవత్సరాల మధ్యలో అన్నా క్యాంటీన్ల పేరుతో పేదల కడుపు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కొవ్వూరు బస్టాండ్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, ఉదయం టిఫిన్ పేదలకు స్వయంగా ఎమ్మెల్యే వడ్డించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చారని, పేద ప్రజలకు తిండి బట్ట గృహము కచ్చితంగా ఉండాలి అని ఎన్టీఆర్ చెప్పేవారని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు క్యాంటీన్లు ప్రారంభించి పేదలు ఆకలని తీర్చారని , కానీ తదుపరి ఏర్పడిన ప్రభుత్వం కక్షపూరితమైన రాజకీయం చేసి పేదల అన్నారు.. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే అన్నారు.. మరలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్లు ఇచ్చిన మాట ప్రకారం గా ప్రారంభించడం జరిగిందని ప్రతి పేదవాడు కడుపు నింపడమే కూటమి ప్రభుత్వం ఆశయం అని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అన్నారు.. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ డానియేలు జోసఫ్, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు