Breaking News

జాతీయ చేతిరాత పోటీల్లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు

-విజేతలుగా నిలిచిన అర్జున్, లక్ష్మి కావ్య, దన్విక్, ముకుంద ప్రియ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయి చేతిరాత పోటీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ కెప్టెన్ గా విశాఖ జిల్లా కలెక్టర్ కుమారుడు ఏ. అర్జున్ సీనియర్ లెవెల్ లో గెలుపొందారు. ఎన్ఆర్ఐ నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ, అమ్మ ఒడి హ్యాండ్ రైటింగ్ , అఖిల భారత హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జూలై 14వ తేదీ ఆన్ లైన్ విధానంలో జరిగాయు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతీయ చేతిరాత పోటీలను నిర్వహిస్తారని చేతిరాత నిపుణులు షేక్ మహబూబ్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు మూడు లక్షల మంది పైగా విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ పోటీలకు హాజరుకాగా, జాతీయ స్థాయిలో సీనియర్ విభాగంలో రెండు, జూనియర్ విభాగంలో రెండు స్థానాలు ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. సీనియర్ స్థాయులో ఏలూరు జిల్లా, కైకలూరు నేషనల్ హైస్కూల్లో చదువుతున్న సిహెచ్ లక్ష్మి కావ్య వండర్ ఆఫ్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ విభాగంలో మొదటి స్థానం సాధించారు. జూనియర్ స్టాయులో విజయవాడ, ఎన్ ఎస్ ఎం స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న అభిరామ దన్విక్ మొదటి స్థానాన్ని, నిర్మల హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న బొప్పన ముకుంద ప్రియ తృతీయ స్థానాన్ని సాధించారు. ఈ క్రమంలో జాతీయ స్థాయు 13 స్థానాల్లో నాలుగు స్థానాలు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దక్కించు కోగలిగారు. విజేతల్లో అర్జున్ , అభిరామ ధన్విక్, ముకుంద ప్రియలకు జాతీయ చేతరాత నిపుణులు భువనచంద్ర శిక్షణ ఇచ్చారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు అతిత్వరలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డులను అందచేయడం జరుగుతుందని హుస్సేన్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *