రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి 9.35 గం.లకు చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా నామినేట్ చేయబడిన దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డ ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డిఐజీ షిమోషి బాజ్ పాయ్, ఎస్.పి సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డా. శిరీష తదితర అధికారులు ప్రజాప్రతినిధులు భారత ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం భారత ఉప రాష్ట్రపతి నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు 9.58 గం.లకు హెలికాప్టర్ లో బయల్దేరి వెళ్ళారు. వీరి వెంట మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో ఉప రాష్ట్రపతి వెంట హెలికాప్టర్ లో బయల్దేరి వెళ్ళారు.
Tags tirupathi
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …