గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ప్రధాన మార్కెట్ ల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధాలను రోడ్ల మీద వేయకూడదని, ప్రజారోగ్యం దృష్ట్యా రోడ్ల మీద వ్యర్ధాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ నందివెలుగు రోడ్ విస్తరణ పనులను, బాలాజీ నగర్, కొల్లి శారద హోల్ సేల్ మార్కెట్, రైతు బజార్, ఆనంద పేట తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం, పొన్నూరు రోడ్, ఏటుకూరు రోడ్ ల్లోని గార్బేజ్ డంపింగ్ పాయింట్స్ ని పరిశీలించి సంబందిత అధికారుల పై చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత కొల్లి శారద హోల్ సేల్ మార్కెట్, రైతు బజార్ లను పరిశీలించి, అక్కడి వ్యాపారులతో మాట్లాడుతూ మార్కెట్ ల నుండి వచ్చే వ్యర్ధాలను రోడ్ల మీద వేయడం వలన, వాటిని తొలగించడంలో జాప్యం జరిగితే దుర్గంధం వచ్చి ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మార్కెట్ ల నుండి వచ్చే వ్యర్ధాలను కమర్షియల్ వ్యర్ధాల సేకరణ వాహనాల ద్వారా తొలగించాలన్నారు. వ్యాపారస్తులు వ్యర్ధాల నిర్వహణకు సహకరించాలని, ఇష్టానుసారం రోడ్ల మీద వేస్తె కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొల్లి శారద హోల్ సేల్ మార్కెట్ లో ఆశీలు వసూళ్లు టెండర్ కు ప్రతిపాదనలు సిద్దం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నందివెలుగు రోడ్ విస్తరణలో భాగంగా జిఎంసి తరుపున చేపట్టాల్సిన పనుల్లో పెండింగ్ లో ఉన్న రోడ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం పొన్నూరు రోడ్, ఏటుకూరు రోడ్ లోని డంపింగ్ యార్డ్ లను పరిశీలించి ప్రతి రోజు వస్తున్న వ్యర్ధాల వివరాలు, జిందాల్ కి పంపుతున్న వ్యర్ధాల వివరాలు అడిగి తెలుసుకొని, వ్యర్ధాలను ప్రజలు తడి పొడిగా తమ ఇళ్ల వద్దనే విభజన చేసి, ఇచ్చేలా అవగాహన కల్గించాలన్నారు. సచివాలయాల వారీగా గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ లేకుండా చూడాలని, డివిజన్ల వారీగా ప్రజారోగ్య కార్మికులను రేషనలైజేషణ్ చేయాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ లో ప్రతి రోజు వస్తున్న వ్యర్ధాలను ప్రాంతాల వారీగా ఎంత వస్తుంది రికార్డ్ చేయాలన్నారు. ఏటుకూరు రోడ్ లోని వీధి కుక్కల ఏబిసి సెంటర్ ని పరిశీలించి, రోజువారీ చేసే ఏబిసిలు పెంచాలని, ఆపరేషన్ చేసిన వీధి కుక్కలు కోలుకునే వరకు సెంటర్ లోనే ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పర్యటనలో డిఈఈ శ్రీధర్, శానిటరీ సూపర్వైజర్ ఆయుబ్ ఖాన్, ఏఈ సునీల్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సలాం, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎం.ఐజాక్, ఏడుకొండలు శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …