-స్రవంతి హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభం
-ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభత్వ పాలనలో రాష్ట్రాన్నే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే కేశినేని ఫౌండేషన్ ద్వారా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉచిత మెడికల్ క్యాంప్స్ నిర్వహించి ప్రజలకు వైద్య సేవ అందించినట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. అశోక్ నగర్ లోని స్రవంతి హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ బ్లాక్ ను ఆదివారం గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్ లతో పాటు ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ కి డాక్టర్ శ్రీనివాస్ సనగుండ్ల ఎంతో సహకారం అందించారన్నారు. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని డాక్టర్ శ్రీనివాస్ సనగుండ్ల, డాక్టర్ స్రవంతి దేవభక్తునికి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జగన్ ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు చేయలేదన్నారు. ఇందువల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య శ్రీ విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.