విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం కార్ల వినియోగం బాగా పెరిగింది. యువత కారును తమకి నచ్చిన రీతిలో వుంచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కామినేని నగర్ లోని మహానాడు రోడ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన క్వాడ్ ప్రో షోరూమ్ ను ఆదివారం గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సంస్థ యజమాని మహ్మాద్ ఖాదర్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
Prajavartha Online Telugu News