Breaking News

శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలకు ఎల్లప్పుడు ఉండాలి-కేశినేని జానకి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజవర్గం చుట్టుగుంట‌ ప్రాంతంలోని శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి 36వ బోనాల సంబరాల్లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణి బొండా సుజాత క‌లిసి పాల్గొన్నారు. అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా కేశినేని జాన‌కి ల‌క్ష్మీ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల సంబరాలుల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు.. రాబోయే రోజుల్లో విజయవాడ ప్రాంతం దేశ స్థాయిలో అభివృధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, 26వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ వల్లభనేని సతీష్,ప్రెసిడెంట్ బీసం రాములు, వైస్ ప్రెసిడెంట్ తోట పాండు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *